VD14: విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమాపై బిగ్ అప్డేట్‌

by velandi.Saikiran |

VD14 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారట.

VD14: విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమాపై బిగ్ అప్డేట్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: విజయ్ దేవరకొండ అభిమానులకు బిగ్ అలర్ట్. విజయ్ దేవరకొండ 14వ సినిమాపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. రాహుల్ దర్శకత్వంలో ఇప్పటికే టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండతో కొత్త సినిమా చేయబోతున్నారు.

VD14 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారట. జనవరి చివరి వారంలో అంటే 31వ తేదీన‌ ఈ టీజర్ ను వదలబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు రణ‌భేరి, ది గన్ అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రెండిటిలో ఒక టైటిల్ ఫైనల్ కాబోతున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా వస్తోంది. 19వ శతాబ్దానికి సంబంధించిన ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. కర్నూలు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నారని టాక్. కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టించ‌బోతున్నార‌ని టాక్‌.

Next Story