Siva Karthikeyan: శివ కార్తికేయన్ ‘SK-25’ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్! (ట్వీట్)

by Mallepaka Hamsa |   (  Updated:2025-01-23 13:46:11  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) గత ఏడాది ‘అమరన్’(Amaran) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విషయాన్ని అందుకున్నారు.

Siva Karthikeyan: శివ కార్తికేయన్ ‘SK-25’ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్! (ట్వీట్)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) గత ఏడాది ‘అమరన్’(Amaran) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విషయాన్ని అందుకున్నారు. అదే ఫామ్‌తో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘కూలి’ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సుధా కొంగర(Sudha Kongara Prasad) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘SK-25’ వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో జయం రవి(Jayam Ravi), అతర్వ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే దీనిని డాన్ పిక్చర్స్(Dawn Pictures) బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్(Akash Bhaskaran), తిరుచిరాపల్లి నిర్మిస్తున్నారు.

‘SK-25’ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమం పూర్తి చేసుకోగా.. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘SK-25’ టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. దీనికి ‘పరాశక్తి’(Parashakti) అనే పవర్ ఫైల్ పేరును కన్ఫార్మ్ చేసినట్లు టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను కూడా మేకర్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు శివ కార్తికేయన్(Siva Karthikeyan) మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని అంటున్నారు.

Next Story