Sharwanand: ‘శర్వా-38’ కు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. ప్రతి రక్తపు బొట్టుకు ఒక కారణం ఉంటుందంటూ హైప్ పెంచుతున్న వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-30 11:19:50  IST  )

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) గత ఏడాది ‘మనమే’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

Sharwanand: ‘శర్వా-38’ కు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. ప్రతి రక్తపు బొట్టుకు ఒక కారణం ఉంటుందంటూ  హైప్ పెంచుతున్న వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) గత ఏడాది ‘మనమే’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. స్రస్తుతం శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ మూవీతో రాబోతున్నాడు. బాలయ్య హిట్ సినిమా టైటిల్‌తో రాబోతుండగా.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలోనే శర్వానంద్ మరో మూవీ ప్రకటన విడుదలైంది. ‘శర్వా-38’ వర్కింట్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను సంపత్ నంది(Sampath Nandi) తెరకెక్కిస్తున్నారు. 1960లో తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్‌లో జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతుండగా.. దీనిని శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), డింపుల్ హయాతీ(Dimple Hayati) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి. ప్రజెంట్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, చిత్రబృందం అదిరిపోయే వీడియోను షేర్ చేస్తూ.. టైటిల్ రివీల్ చేశారు. అయితే ఇందులో ఏముందంటే.. శర్వానంద్ కూర్చొని ఉండగా.. ఒకచోట యుద్ధం జరుగుతున్నట్లు చూపించారు.

ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా చేసుకునే పండుగ ‘భోగి’ పేరును పెట్టినట్లు తెలుపుతూ కత్తిపై మంటల్లో వేసి హైప్ పెంచారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఈ రోజు నుంచి మొదలుకాబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ప్రతి రక్తపు బొట్టు ఒక కారణం. ప్రతి మొదటి చెర్రీ ఒక ఉద్దేశ్యం.శర్వా-38కు ఒక రక్తసిక్తమైన పేరును పెట్టాం’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషల్లో విడుదల కాబోతుంది.

Next Story