‘పెద్ది’ నుంచి పవర్ ఫుల్ యాక్టర్ పోస్టర్ రిలీజ్.. కోచ్‌గా అదరిపోయే లుక్‌లో గౌర్ నాయుడు..

by Gugulothu.Kavitha |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న తాజా సినిమా ‘పెద్ది’(Peddi).

‘పెద్ది’ నుంచి పవర్ ఫుల్ యాక్టర్ పోస్టర్ రిలీజ్.. కోచ్‌గా అదరిపోయే లుక్‌లో గౌర్ నాయుడు..
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న తాజా సినిమా ‘పెద్ది’(Peddi). దీనికి బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక దీన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇక ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా తాజాగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shivarajkumar) ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పెద్ద పెద్ద మీసాలు, గంభీరమైన చూపుతో శివరాజ్ కుమార్ లుక్ పవర్ ఫుల్‌గా కనిపిస్తోంది. ఇందులో ఆయన 'గౌర్ నాయుడు' పాత్రలో కనిపించబోతున్నారు. కాగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Link

Next Story