- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంబరాల ఏటిగట్టు నుంచి పవర్ ఫుల్ యాక్టర్ పోస్టర్ రిలీజ్.. రాయప్ప లుక్‌లో హైప్ పెంచుతున్నాడుగా..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన రోహిత్ కేపీ(Rohit KP) దర్శకత్వంలో ‘సంబరాల ఏటిగట్టు’(Sambara Yetigattu) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్‌లో తేజ్ కనిపించిన తీరు చూసి ఇటు ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. మొదటిసారిగా తేజ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడని.. దీంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) నటిస్తోంది.
అయితే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై చైతన్య రెడ్డి(chaitanya Reddy), నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి పవర్ ఫుల్ యాక్టర్ సాయికుమర్(Saikumar) ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు.
ఈరోజు అతని బర్త్‌డే స్పెషల్‌గా అతనికి విష్ చేస్తూ ‘ సాయి కుమార్ తన అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్ మరియు ఐకానిక్ పెర్ఫార్మెన్స్‌తో, రాయప్ప యుగాలకు ఒక పాత్రగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు’ అని ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సాయి కుమార్ రాయప్ప(Rayappa) క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇక పోస్టర్‌లో సాయి కుమార్ చాలా ముసలి వాడిలా కనిపిస్తున్నాడు. చేతిలో కర్ర, నెరిసిన నెత్తి, గడ్డంతో ఉన్నాడు. అతని వెనుక ఓ కొండ దానికింద చెట్లు, దూరంగా గుడిసెలు ఉన్నాయి. Link






