OG Movie: కత్తితో స్క్రీన్ చింపేసిన పవర్ స్టార్ అభిమానులు !

by velandi.Saikiran |

OG పవన్ కళ్యాణ్ తరహాలో కత్తితో థియేటర్ కు వచ్చారు పవర్ స్టార్ అభిమానులు. ఈ తరుణంలోనే ఆ కత్తితో స్క్రీన్ ను చింపేశారు.

OG Movie: కత్తితో స్క్రీన్ చింపేసిన పవర్ స్టార్  అభిమానులు !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఏపి డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించినా ఓజీ సినిమా... తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. పాజిటివ్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. బ్లాక్ లో ఎంత ధర అయినా పెట్టి టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త ఓవర్ గా బిహేవ్ చేశారు.

ఈ సినిమా చూసేందుకు ఏకంగా పవన్ కళ్యాణ్ తరహాలో కత్తితో థియేటర్ కు వచ్చారు పవర్ స్టార్ అభిమానులు. ఈ తరుణంలోనే ఆ కత్తితో స్క్రీన్ ను చింపేశారు. సినిమా ప్రారంభం అయ్యే కంటే ముందు ఈ సంఘటన జరిగింది. బెంగళూరులోని కె ఆర్ పురం లో... ఈ సంఘటన జరగగా.. ప్రీమియర్ షోను రద్దు చేసింది యాజమాన్యం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లిక్

Next Story