- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు
ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా,నేరస్తులకు అనుకూలంగా నేరం చేస్తాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ముగ్గురు యువకులపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సిఐ కరుణాకర్ రావు తెలిపారు

దిశ, ఆదిలాబాద్ : ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా,నేరస్తులకు అనుకూలంగా నేరం చేస్తాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ముగ్గురు యువకులపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సిఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా టూ టౌన్ లో ఆయన గురువారం కేసు వివరాలు వెల్లడించారు. ఇందులో గత ఫిబ్రవరి 24న ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతి నగర్ వద్ద జరిగిన హత్య కేసుల్లో ప్రధాన నిందితులైన గోల్డెన్ కార్తీక్, సిద్ధూ,సాయిని అరెస్టు చేశారు.
ఈ హత్యకు ముందు ఈ ముగ్గురితోపాటు ప్రస్తుతం కేసు నమోదు అయిన కొత్తూరి సాయి వర్ధన్, కావలే ఆశిష్, కొచ్చాడే నీలేష్ లు ఆ హత్యను గురించి 307 అయిపోయిందని, నా పవర్ 302 అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కారణంగా ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ రావు తెలిపారు. అదేవిధంగా ఈ ముగ్గురిని అరెస్టు చేస్తున్న క్రమంలో పరీక్ష చేయగా.. అందులో కొత్తూరు సాయి వర్ధన్, కావలి ఆశిష్ లు గంజాయి సేవించి ఉన్నట్లు నిర్ధారణ చేశారు. వీరిద్దరిపై ఇతర కేసుతో పాటు గంజాయి కేసు,ముగ్గురిపై165/25 ఐటీ ఆక్ట్ తో కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా, బెదిరించేలా పోస్టులను పెట్టిన, కత్తులతో బెదిరించేలా పోస్టులను పెట్టిన వారిపై కేసుల నమోదు చేయబడతాయని హెచ్చరించారు.






