- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాయిదా పడిన 'దృశ్యం 3'
ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన దృశ్యం 3 వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మలయాళ స్టార్ నటుడు 'మోహన్ లాల్'కి మంచి గుర్తింపును తీసుకువచ్చిన చిత్రాలలో దృశ్యం ఒకటి. ఈ చిత్రం మలయాళ వర్షన్ ఇతర భాషల్లో విడుదల కాకపోయినా, చాలా భాషల్లో రీమేక్ అయ్యింది. అన్ని ప్రాంతాల్లో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ సీనియర్ నటుడు నటించిన ఎన్నో సినిమాలు ఇతర భాషల్లో విడుదలయ్యాయి. దృశ్యం సిరీస్ నుండి ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. ఆ రెండు మంచి ప్రేక్షకాదరణ పొందాయి.
దృశ్యం 1 థియేటర్లలో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంటే, దృశ్యం 2 మాత్రం నేరుగా ఓటీటీలో విడుదలయ్యింది. ప్రస్తుతం దృశ్యం 3 చిత్రీకరణ జరుగుతుంది. మలయాళంలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయినా జీతూ జోసఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ప్రస్తుతానికి ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లోనే ప్రకటించనున్నారు. దృశ్యం 1, 2 తెలుగు రీమేక్ లలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు. మరి 'దృశ్యం 3'ని నేరుగా తెలుగులో విడుదల చేస్తారా? లేక విక్టరీ వెంకటేష్ దీన్ని కూడా రీమేక్ చేస్తాడా అనేది చూడాలి. ఏదేమైనా 'దృశ్యం 3' ఎప్పుడు వస్తుందా అని మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మలయాళ 'దృశ్యం'లో హీరోయిన్గా నటించిన మీనా తెలుగులో కూడా నటించింది.






