- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akkineni Akhil-6: ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం లేదంటూ క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
అక్కినేని అఖిల్ (Akkineni Akhil)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ‘అఖిల్’ సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను అలరించారు.

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ (Akkineni Akhil)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ‘అఖిల్’ సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ హిట్ సాధించలేకపోయాడు. దీంతో ఊహించనంత క్రేజ్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఇక ‘ఏజెంట్’ (Agent)సినిమాతో భారీ డిజాస్టర్‌ను చవిచూసిన అఖిల్ దాదాపు రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. మళ్లీ ఇప్పుడు అఖిల్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖిల్-6’. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainments)బ్యానర్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు కిశోర్ అబ్బూరు(Kishore Abburu) దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు ఇటీవల నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ద్వారా వెల్లడించడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, అఖిల్-6 చిత్రానికి సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు తెలుపుతూ మూవీ మేకర్స్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. చేతికి కడియం ధరించి ఉండగా.. మరో దానికి ధారాలు కట్టుకుని రక్తంతో నిండి ఉన్నాయి. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం లేదు’’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా అఖిల్ పుట్టిన రోజు కానుకగా ఏప్రిల్ 8వ తేదీన టైటిల్, గ్లింప్స్ రాబోతున్నాయి అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






