- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రముఖ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష
గోల్డ్ స్మగ్లింగ్ కన్నడ నటి రన్యా రావు కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం (COFEPOSA) కింద ఆమెపై నమోదైన కేసులో భాగంగా పూర్తి విచారణ అనంతరం కోర్టు ఈ మేరకు ఆమెకు ఏడాది జైలు శిక్ష ఖరారు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: గోల్డ్ స్మగ్లింగ్ కన్నడ నటి రన్యా రావు (Kannada actress Ranya Rao) కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం (COFEPOSA) కింద ఆమెపై నమోదైన కేసులో భాగంగా పూర్తి విచారణ అనంతరం కోర్టు ఈ మేరకు ఆమెకు ఏడాది జైలు శిక్ష ఖరారు చేసింది. రన్యా రావు, మార్చి 3న బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుండి 14.8 కిలో గ్రాముల బంగారం (₹12.56 కోట్ల విలువ) స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు పట్టుబడింది.
రన్యా రావు, ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు, అలాగే జ్యువెలర్ సాహిల్ జైన్‌లు ఈ స్మగ్లింగ్ రాకెట్ (Smuggling racket)లో భాగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. రన్యా 2023 నుండి 2025 వరకు దుబాయ్‌కు 56 సార్లు ప్రయాణించగా.. అందులో 20 సార్లు తరుణ్‌తో కలిసి ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆమె ప్రయాణాలపై విచారించగా.. పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా.. ₹2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ₹2.67 కోట్ల నగదు బయటపడింది.
దీంతో నటి నుంచి మొత్తం ₹17.29 కోట్ల నగదు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు పూర్తి దర్యాప్తుతో రన్యా రావును కోర్టులో హాజరు పరచగా.. ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. అలాగే రన్యా రావు పై ఈ కేసు దర్యాప్తుకు సహకరించకపోవడంతో పాటు మరిన్ని స్మగ్లింగ్ కార్యకలాపాలను నిరోధించేందుకు COFEPOSA చట్టం జారీ చేయబడింది. ఈ క్రమంలోనే ఈ శిక్ష కాలంలో ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసే హక్కును కూడా కోర్టు నిరాకరించింది. దీంతో నటి రన్యా రావు సంవత్సరం పాటు జైలులోనే ఉండనుంది.






