- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత..
సినీ పరిశ్రమకు సేవలందించిన సీనియర్ నటుడు, హాస్యనటుడిగా పేరుపొందిన మైసూరు శ్రీకాంతయ్య ఉమేశ్ ఆదివారం కన్నుమూశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కన్నడ సినీ పరిశ్రమకు సేవలందించిన సీనియర్ నటుడు, హాస్యనటుడిగా పేరుపొందిన మైసూరు శ్రీకాంతయ్య ఉమేశ్ (80) ఆదివారం కన్నుమూశారు. క్యాన్సర్‌తో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని కిడ్వాయి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో 400కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రత్యేకమైన టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించారు. 1960లో చైల్డ్ ఆర్టిస్టుగా‘మక్కళ రాజ్య’ చిత్రంతో 1960లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఉమేశ్, అనంతరం అందరి ప్రేమను సంపాదించారు. డాక్టర్ రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, అనంత్ నాగ్ వంటి కన్నడ ప్రముఖ నటులతో తెర పంచుకునే అరుదైన అవకాశాన్ని పొందారు. ‘గురు శిష్యరు’, ‘గోల్‌మాల్ రాధాకృష్ణ’ వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఉమేశ్ మరణ వార్త తెలిసిన వెంటనే కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన కుటుంబానికి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సానుభూతి తెలియజేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సినీ రంగంలో చిరస్మరణీయమైన ముద్ర వేసిన ఎంఎస్ ఉమేశ్ మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా పలువురు అభిప్రాయపడ్డారు.






