- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమంత-రాజ్ పెళ్లి.. పూనమ్ హాట్ కామెంట్స్
నటి సమంత, డైరెక్టర్ రాజ్ నిడమనోరు నేడు కోయంబత్తూర్ లోని ఈషా సెంటర్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : నటి సమంత, డైరెక్టర్ రాజ్ నిడమనోరు నేడు కోయంబత్తూర్ లోని ఈషా సెంటర్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా వీరి వివాహంపై సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ దంపతులు సంతోషంగా ఉండాలని దీవిస్తుండగా.. వీరి వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే సామ్ రెండో వివాహంపై మరో నటి పూనమ్ కౌర్ పరోక్షంగా విమర్శల దాడికి దిగారు. తాను సొంత గూడు కట్టుకోడానికి మరొకరి ఇంటికి కూల్చేయడం చాలా బాధాకరం అన్నారు.
బలహీనమైన, నిరాశయులైన పురుషులను డబ్బుతో ఈజీగా కొనవచ్చు అంటూ.. ఈ అహంకారపూరిత మహిళను ఆమె పెయిడ్ పీఆర్ టీమ్ గొప్పగా చూపించడం దారుణం అని మండిపడ్డారు. ఈమేరకు పూనమ్ తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసింది. అయితే ఎక్కడా సామ్-రాజ్ పేర్లు ప్రస్తావించకుండానే చేసిన ఈ వ్యాఖ్యలు సమంత గురించేనని అంటున్నారు. సమంత వివాహాన్ని వ్యతిరేకిస్తున్న వారు పూనమ్ ట్వీట్ ను భారీగా రీ ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం పూనమ్ చేసిన విమర్శలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.






