Pooja Hegde: చాలా బాధగా ఉంది.. ఇదొక చేదు వార్త.. పూజా హెగ్డే ఎమోషనల్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-08 06:01:20  IST  )

‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీలో నాగ చైతన్య(Naga Chaitanya) సరసన నటించిన పూజా హెగ్డే(Pooja Hegde).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

Pooja Hegde: చాలా బాధగా ఉంది.. ఇదొక చేదు వార్త.. పూజా హెగ్డే ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీలో నాగ చైతన్య(Naga Chaitanya) సరసన నటించిన పూజా హెగ్డే(Pooja Hegde).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అంతేకాకుండా యూత్ మనసులో క్రష్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన చిత్రాలన్నిటిలో నటించి మెప్పించింది. ఇక అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’(Ala Vaikuntapuramlo) సినిమాలోని ‘బుట్టబొమ్మ’(Butta Bomma) సాంగ్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది.

అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించిన ఈ బ్యూటీకి సడెన్‌గా వరుస ప్లాప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ బిరుదుతో పాటు సినిమా చాన్స్‌లు కరువయ్యాయి. దీంతో కొన్ని నెలలు సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ రీసెంట్‌గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) నటించిన ‘రెట్రో’(Retro) మూవీతో మన ముందుకు వచ్చి ఓకే ఓకే అనిపించుకుంది. ప్రస్తుతం దళపతి విజయ్(Vijay) హీరోగా నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతుంది. ఇక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. కొన్నాళ్లుగా నా లైఫ్‌లో విజయం అనే పదానికి అర్ధం మారిపోయింది. కానీ నాకు ఈ టైం చాలా ఇంపార్టెంట్.. భవిష్యత్తులో నేను చేసే సినిమాలు నేను ఎలాంటి నటిని అనేది ప్రేక్షకులకు చూపిస్తాయని అనుకుంటున్నా.. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.. వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా కానీ నేను సాధించాల్సింది చాలా ఉంది.

అందరి జీవితంలో హెచ్చుతగ్గులు కచ్చితంగా ఉంటాయి. మేము నటులం ఫ్లాప్‌లను కూడా స్వీకరించాలి. ‘బీస్ట్‌’(Beast) సినిమా తర్వాత ఇప్పుడు ‘జన నాయగన్’(Jana Nayagan) సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. కానీ ఇది విజయ్ చివరి చిత్రం అవ్వడం ఒకింత బాధగా అనిపిస్తుంది. నా దృష్టిలో ఇదొక చేదు వార్త. ఎందుకంటే నాతో పాటు చాలా మంది అభిమానులు విజయ్‌ సినిమాల్ని ఇష్టపడతారు. ఒకప్పుడు ఆయన సినిమాల కోసం ఎదురు చూసేవాళ్ళం’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Next Story