Pooja Hegde: బంపర్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే.. హైప్ పెంచుతున్న పోస్ట్

by Mallepaka Hamsa |

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) గతంలో స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

Pooja Hegde: బంపర్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే.. హైప్ పెంచుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) గతంలో స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కానీ బీస్ట్, రాధే శ్యామ్(Radhe Shyam),కిసీ కా భాయ్ కిసీ కా జాన్(Kisi Ka Bhai Kisi Ki Jaan) వంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అమ్మడు ఇండస్ట్రీకి దూరం అయింది. ఏడాది పాటు ఖాళీగా ఉన్న పూజా సోషల్ మీడియాకు పరిమితం అయ్యింది. పలు యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది. ఇక సినిమాలకు దూరం అవుతుందనే వార్తలు కూడా వచ్చాయి.

ఇక ఆమె కెరీర్ ముగిసినట్లే అని కూడా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మళ్లీ వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. విజయ్-69, రెట్రో వంటి చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా, పూజా హెగ్డే ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. షాహిద్ కపూర్(Shahid Kapoor) ‘దేవా’ మూవీలో దియాగా నటిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా బోల్డ్, బ్యూటీఫుల్ లుక్‌లో కనిపించనున్నట్లు వెల్లడించింది. ప్రజెంట్ ఈ పోస్ట్ సినిమాపై హైప్ పెంచుతోంది.

దీంతో పాటు ‘దేవా’ ట్రైలర్‌ను కూడా షేర్ చేసింది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. షాహిద్ యాక్షన్స్ తప్ప ఎక్కువ డైలాగ్స్ లేవు. కాగా, ‘దేవా’ మూవీకి రోషన్ ఆండ్రూస్(Roshan Andrews) దర్శకత్వం వహస్తుండగా.. పావైల్ గులాటీ, విశాల్ మిశ్రా(Vishal Mishra) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీనిని జీ స్టూడియోస్(Zee Studios), రాయ్ కపూర్ ఫిల్మ్స్(Roy Kapoor Films) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ‘దేవా’ చిత్రం జనవరి 31న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Next Story