Pooja Hegde: మూడేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన పూజా హెగ్డే.. ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |

తెలుగులో బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే (Pooja Hegde)..

Pooja Hegde: మూడేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన పూజా హెగ్డే.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: తెలుగులో బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే (Pooja Hegde).. 2022లో వచ్చిన ‘రాధే శ్యామ్’ (Radhe Shyam), ‘ఆచార్య’ వంటి చిత్రాల తర్వాత టాలీవుడ్‌లో మరో మూవీ చేయలేదు. ఇక ఎఫ్-3లో ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించిన ఈ అమ్మడు.. ప్రజెంట్ కోలీవుడ్‌(Kollywood)పై ఫోకస్ట్ పెట్టి అక్కడ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే త్వరలో రజినీకాంత్ ‘కూలీ’తో పాటు సూర్య ‘రెట్రో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya), డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రెట్రో’ చిత్రం మే 1 థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. దీంతో రెట్రో ప్రమోషన్స్‌గా భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే.. తెలుగు ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది.

‘ఎంతో మంది స్టార్ హీరోలతో డిఫరెంట్ స్టైల్లో (different style) సినిమాలు తెరకెక్కిస్తారు కార్తిక్ సుబ్బరాజు. ఆయన మూవీలో నాకు చాన్స్ రావడంతో సంతోషంగా భావిస్తున్నాను. ఇక సూర్య గురించి నేను చెప్పేది ఏం లేదు. ఆయన ఎంత మంచివారో తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఆయనతో వర్క్ చేస్తున్నంత సేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది. ఇక మీరు అందరికి పూజా హెగ్డే కావచ్చు.. మాకు జిగేల్ రాణి అని యాంకర్ అనగా.. ‘ఏ యాక్టర్‌కి అయినా అదొక బెస్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. తను చేసిన క్యారెక్టర్‌ను గుర్తింపుగా బుట్టబొమ్మ, జిగేల్ రాణి వంటి పేర్లు నాకు పెద్ద కాంప్లిమెంట్’ అని తెలిపింది. మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. తెలుగులో సినిమా చేసి మూడేళ్లు అవుతుంది అనే ప్రశ్నకు.. ‘నేను మంచి స్టోరీ, క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నా. షూటింగ్ కోసం సెట్‌లోకి వెళ్తున్నప్పుడు ఎగ్జైట్‌మెంట్ రావాలి. ప్రేక్షకులు ఆ సినిమాతో కొత్త పూజాను చూడాలని నేను ట్రై చేస్తున్నాను. అయితే.. తెలుగులో ఒక సినిమా సైన్ చేశాను. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’ అంటూ గుడ్ న్యూస్ (Good news) చెప్పింది పూజా.

Next Story