Pooja Hegde: ‘రెట్రో’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన బుట్ట బొమ్మ.. పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’(Retro).

Pooja Hegde: ‘రెట్రో’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన బుట్ట బొమ్మ.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’(Retro). దీనికి కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తుండగా.. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జ్యోతిక(Jyothika), సూర్య నిర్మిస్తున్నారు. ఇక 1980 బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం మే 1న తమిళం, తెలుగులో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్(Songs), టీజర్(Teaser), గ్లింప్స్(Glimps) ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పూజా హెగ్డే పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా బుట్టబొమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో రెట్రో మూవీ డబ్బింగ్ స్టార్ట్ అయినట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story