- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pooja Hegde: కాంతి కిరణాల వెలుగులో బుట్టబొమ్మ.. వీపు చూపిస్తూ నెట్టింట పోస్ట్
ఒకప్పుడు వరుస సినిమాల్లో అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde).

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు వరుస సినిమాల్లో అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde). ఈ బ్యూటీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. కానీ తర్వాత పూజా హెగ్డేకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ బుట్టబొమ్మ ప్రజెంట్ కథ ఎంపికల విషయంలో ఆచితూచి అడుగువేస్తుంది. ప్రస్తుతం ఈ నటి బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సరసన హై జవానీతో ఇష్క్ హూనా హై సినిమాలో నటిస్తుంది.
రీసెంట్ గానే ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టారు. ఈ మూవీకి వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రిషికేశ్‌లో చిత్రీకరణ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఇటీవలే తిరుపతిలోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయాన్ని దర్శించుకుంది. ఫ్యామిలీతో కలిసి ఈ ముద్దుగుమ్మ ఆలయానికి వెళ్లింది.
అక్కడ కుటుంబ సభ్యులంతా కలిసి రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు చేయించుకున్నారు. తర్వాత శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్జాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకున్నారు. మరుసటి రోజు తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుంది పూజా హెగ్డే. ఇకపోతే తాజాగా ఈ నటి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కాంతి కిరణాల వెలుగులో వీపు చూపిస్తోన్న పిక్స్ పంచుకుంది. వీటికి ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.‘నీ కాంతి కిరణాల వెలుగులో’ అని జోడించింది. ప్రస్తుతం పూజా హెగ్డే పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






