- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pooja Hegde: ‘‘వాటితో ప్రేమలో పడ్డాను’’ బుట్టబొమ్మ సెన్సేషనల్ కామెంట్స్
హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వరుస అవకాశాలు దక్కించుకుని ఫుల్ పాపులర్ అయ్యింది. అందం, అభినయం, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో కొన్ని డేస్ పాటు ఈ హీరోయిన్ ఓ ఊపు ఊపిందనడంలో అతిశయోక్తిలేదు.
ఏకంగా టాలీవుడ్ అగ్ర కథానాయకులతో నటించి మెప్పించింది. టాలీవుడు ప్రముఖ సీనియర్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu Arjun) వంటి స్టార్ హీరోలతో నటించి.. తన క్యూట్ నెస్‌తో కుర్రాళ్లను ఫిదా చేసింది ఈ కుర్ర హీరోయిన్.
ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన దేవా (Deva) సినిమా నేడు (జనవరి 31) వ తేదీన థియేటర్లలో గ్రాండ్ విడుదల అయ్యింది. ఈ బాలీవుడ్ సినిమాలో నటుడు షాహిద్ (Shahid) కథానాయకుడిగా నటించారు. పూజా హెగ్డే కీలక పాత్రలో పోషించారు.
నటుడు షాషిద్ అండ్ పూజా మధ్య లిప్ లాక్స్ కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. కానీ ఈ సన్నివేశాలు కాస్త ఘాటుగా ఉండటంతో తొలగించినట్లు టాక్. అలాగే ఈ మూవీకి సెన్సార్ యుఏ సర్టిఫికేట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు రోషన్ ఆడ్రూస్ దర్శకత్వం వహించారు. అలాగే రాయ్ కపూర్ ఫిలిమ్స్ సంస్థ (Roy Kapur Films Company) ఈ చిత్రాన్ని నిర్మించింది.
అయితే పూజా హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలు పంచుకుంది. టాలీవుడ్ లో.. అలాగే ఇటు హిందీలో అవకాశాలు రావడం నిజంగా హ్యాపీగా ఉందని.. కానీ బ్యాలెన్స్ చేయడం కాస్త కష్టమేనని వెల్లడించింది. కానీ తన కెరీర్ హెచ్చుతగ్గులతో సాగిందని.. ఒకప్పుడు ఒక మూవీ అయిపోగానే నెక్ట్స్ సినిమా కోసం ఎదురుచూసేదాన్ని అని వెల్లడించింది. దీంో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది.. సినిమాలతో ప్రేమలో పడ్డానా ఏంటి? అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా మూవీల్లో పెద్దగా చాన్స్‌లు రాకపోయినా ఎప్పుడూ బాధ పడలేదు అని తెలిపింది.






