- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
hegdepooja: పాతకాలపు 70 ఏళ్ల నాటి అద్భుతమైన చీరలో బుట్టబొమ్మ.. చేతిలో మల్లెపువ్వులతో ఆకట్టుకుంటోన్న పోస్ట్
ఒకప్పుడు వరుస సినిమాల్లో అగ్ర హీరోల సరస అవకాశాలు దక్కించుకుంది హీరోయిన్ పూజా హెగ్డే.

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు వరుస సినిమాల్లో అగ్ర హీరోల సరస అవకాశాలు దక్కించుకుంది హీరోయిన్ పూజా హెగ్డే. ఈ బ్యూటీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. కానీ తర్వాత పూజా హెగ్డేకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ బుట్టబొమ్మ ప్రజెంట్ కథ ఎంపికల విషయంలో ఆచితూచి అడుగువేస్తుంది. ప్రస్తుతం ఈ నటి బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సరసన హై జవానీతో ఇష్క్ హూనా హై సినిమాలో నటిస్తుంది.
రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమాకు వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రిషికేశ్‌లో చిత్రీకరణ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ఈ హీరోయిన్ తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. కొన్నిసార్లు బోల్డ్ లుక్‌లో దర్శనమివ్వగా.. మరికొన్నిసార్లు సంప్రదాయ లుక్‌లో దర్శనమిస్తుంటుంది.
తాజాగా పూజా హెగ్డే సంప్రదాయ లుక్‌లో ఫొటో షూట్ చేసింది. ఈ పోస్ట్‌కు పూజా ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఆ పాతకాలపు గదిలోంచి, 70 ఏళ్ల నాటి అద్భుతమైన చీర.. నా అందమైన అజ్జీ (అమ్మమ్మ) కంజీవరంలో రోజు గడుపుతున్న దృశ్యాలు, పెళ్లికి వెళ్ళే ముందు ఇంట్లో ఉండే మల్లిగె తాజా వాసన, మొదటి వర్షం తర్వాత తడిసిన మంగళూరు బురద వాసనలు... ఓహ్, సరళమైన విషయాలలో అందం’’ అంటూ పూజా సంతోషంగా తన మనసులోని మాటల్ని వ్యక్తపరిచింది.






