- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pooja Hegde: ఆ మూవీలో ఆ సీన్స్ బాగా చేయడం వల్లే ‘రెట్రో’లో చాన్స్ వచ్చింది.. బుట్ట బొమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నాగ చైతన్య(NAGA CHAITANYA) సరసన ‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: నాగ చైతన్య(NAGA CHAITANYA) సరసన ‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో తన నటనతో బాగానే పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత స్టార్ డమ్ రాకపోవడంతో పాటు ఐరన్ లెగ్ బిరుదు తెచ్చుకుంది. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది ఈ బ్యూటీ.
ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. అయితే ఒకటి రెండు సినిమాల్లో కాదండోయ్ దాదాపు 6 సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో ‘దేవా’(Deva), ‘రెట్రో’(Retro), ‘జన నాయగన్’(Jana Nayagan), దుల్కర్ సల్మాన్(Dulquer Salman) సరసన ఓ మూవీ అలా మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. షాహిద్ కపూర్(Shahid Kapoor) హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవా’. ఈ సినిమా జనవరి 31న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది.
అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బుట్ట బొమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘రెట్రోలో నేను విభిన్నమైన పాత్ర పోషించా. ఈ రోల్ దక్కడానికి కారణం గతంలో నేను నటించిన ‘రాధేశ్యామ్’(Radhe Shyam) మూవీ. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుకు అందులోని నా ఎమోషనల్ సీన్స్ నచ్చాయి. రెట్రోలోనూ ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో నన్ను హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు’ అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా రెట్రో మూవీని సూర్య(Surya) హీరోగా కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) తెరకెక్కిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ మే 1న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.






