ఆ హీరో కోసం రిస్క్ తీసుకున్న పూజా హెగ్డే

by Sujitha Rachapalli |

ఇళయ దళపతి విజయ్ చివరి మూవీ ‘జన నాయగన్’. మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్న మూవీ గురించి డైరెక్టర్ హెచ్. వినోద్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఆ హీరో కోసం రిస్క్ తీసుకున్న పూజా హెగ్డే
X

దిశ, సినిమా : ఇళయ దళపతి విజయ్ చివరి మూవీ ‘జన నాయగన్’. మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్న మూవీ గురించి డైరెక్టర్ హెచ్. వినోద్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విజయ్, మమిత, డియోల్.. ఈ మూడు క్యారెక్టర్ల చుట్టూ సినిమా తిరుగుతుందని.. మిగతా పాత్రలన్నీ చిన్న చిన్నగానే ఉంటాయని తెలిపాడు. పూజా హెగ్డే పాత్ర కూడా చాలా చిన్నదని.. అయినా కూడా తాను ఇందుకు ఒప్పుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందని తెలిపింది. పూజా చాలా హార్డ్ వర్కర్ అని.. డౌన్ టు ఎర్త్ పర్సన్ అని కాంప్లిమెంట్‌స్ ఇచ్చాడు. అందరితోనూ కలిసిపోతుందని తెలిపాడు. ఈ మూవీలో తనకు బిగ్ పోర్షన్ లేకపోయినా.. విజయ్ కోసం నటించేందుకు ముందుకు వచ్చిందని వివరించాడు. ఇక మమిత విషయానికి వస్తే ఇందులో ఆమెకు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయని.. చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పాడు డైరెక్టర్.

Next Story