- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూజ హెగ్డేకు బంపర్ ఆఫర్.. నాని మూవీలో ఛాన్స్?
by velandi.Saikiran |
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో

X
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన సమయంలో పూజా హెగ్డే కు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అల్లు అర్జున్ లాంటి బడా హీరోల సరసన కూడా సినిమాలు చేసింది. అయితే అలాంటి హీరోయిన్ పూజ హెగ్డే కు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు లేకుండా పోయాయి. మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారంలో పూజా హెగ్డే కు మొదటగా అవకాశం రాగా, ఆ తర్వాత ఆమెను తప్పించారు.
శ్రీ లీలను తీసుకున్నారు. ఇక అప్పటినుంచి హీరోయిన్ పూజ హెగ్డే కు అవకాశాలు లేకుండా పోయాయి. అయితే తమిళ ఇండస్ట్రీలో ఆమెకు ఛాన్సులు వస్తున్నాయి. ఇటీవల ఐటెం సాంగ్ చేసి కూడా అందరిని మెప్పించింది. ఇలాంటి నేపథ్యంలో తెలుగులో కూడా ఐటమ్ సాంగ్ అవకాశం ఆమెకి వచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. హీరో నాని చేస్తున్న ది పారడైజ్ మూవీలో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. అందులో మొదట హీరోయిన్ తమన్నాను అనుకున్నారు. అయితే ఇప్పుడు పూజ హెగ్డే పేరు తెరపైకి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఐటెం సాంగ్ అయినా పర్వాలేదు, చేస్తానని పూజ హెగ్డే కూడా ఒప్పుకున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట.
Next Story






