- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pooja Hegde: ఆ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా బుట్టబొమ్మ.. హైప్ పెంచేస్తున్న న్యూస్
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్(Shahid Kapoor), పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవా’(Deva).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్(Shahid Kapoor), పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవా’(Deva). బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ‘దేవా’ సినిమాను ప్రేరణగా తీసుకుని ఈ చిత్రం రూపొందుతుండగా.. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రోస్(Roshan Andros) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే రాయ్ కపూర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 31న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి రీసెంట్‌గా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవా సినిమాలో బుట్ట బొమ్మ పూజా.. ఇన్విస్టిగేటివ్ జర్నలిస్టుగా కనిపించనున్నట్లు సినీ వర్గాల టాక్. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో పూజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమా అయినా ఈ భామకు కలిసివస్తుందేమో చూడాల్సి ఉంది.






