గ్రాండ్‌గా ‘పొలిమేర 3’ స్టార్ట్.. స్పెషల్ రోల్ చేయబోతున్న యాక్షన్ కింగ్

by Chukka Sudharani |

హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ పొలిమేర-3 తాజాగా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్అయింది.

గ్రాండ్‌గా ‘పొలిమేర 3’ స్టార్ట్.. స్పెషల్ రోల్ చేయబోతున్న యాక్షన్ కింగ్
X

దిశ, సినిమా: ఓటీటీలో 'మా ఊరి పొలిమేర'తో సంచలనం సృష్టించి, థియేటర్లలో 'పొలిమేర 2'తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న విజయవంతమైన హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ఇప్పుడు పొలిమేర-3గా మరింత పవర్‌ఫుల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సికింద్రాబాద్‌లోని ఓ గణేష్‌ ఆలయంలో సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తొలి క్లాప్ ఇవ్వగా, సీనియర్ నిర్మాత డి. సురేష్ బాబు కెమెరా స్వీచ్చాన్‌ చేశారు. ఈ ప్రకటనలో అతిపెద్ద ఆకర్షణగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 'పొలిమేర' వరల్డ్‌లోకి అడుగుపెట్టడం నిలిచింది.

'బ్లాస్ట్ జోన్' విజయానంతరం అర్జున్ ఈ ఫ్రాంచైజీలో కీలకమైన శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. దక్షిణ భారతదేశవ్యాప్తంగా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, శక్తివంతమైన నటనతో అభిమానులను సంపాదించుకున్న అర్జున్ చేరికతో 'పొలిమేర 3'పై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. తన ఉత్కంఠభరిత కథనం, ఊహించని మలుపులతో 'పొలిమేర'ను కల్ట్ ఫేవరెట్‌గా నిలిపిన దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈసారి తన అత్యంత ప్రతిష్ఠాత్మక కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడో భాగంలో మరింత లోతైన రహస్యాలు, భయానక అతీంద్రియ అంశాలు, సంచలనాత్మక మలుపులతో 'పొలిమేర' ప్రపంచాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Next Story