- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పోలీసోడు’ రీరిలీజ్
స్టార్ హీరో విజయ్, టాప్ హీరోయిన్ సమంత జంటగా నటించిన చిత్రం ‘తెరి’. తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో రిలీజ్ అయింది. సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి థాను నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

దిశ, సినిమా : స్టార్ హీరో విజయ్, టాప్ హీరోయిన్ సమంత జంటగా నటించిన చిత్రం ‘తెరి’. తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో రిలీజ్ అయింది. సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి థాను నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించగా.. మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ నెల 23న రీ-రిలీజ్ కానుంది. నైజాం ప్రాంతంలో ప్రముఖ పంపిణీ సంస్థ ఏషియన్ ఫిలిమ్స్, ఆంధ్రాలో సురేష్ మూవీస్ భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రీ-రిలీజ్ వార్తతో సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తుండగా.. విజయ్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు మరోసారి ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండ్రి–కూతురు అనుబంధం, పోలీస్ బ్యాక్‌డ్రాప్, భావోద్వేగాలు, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మేళవించి అట్లీ ఈ ‘పోలీసోడు’ చిత్రాన్ని రూపొందించారు.






