'OG' సినిమాకు గుండెకాయ లాంటి సీన్..పోలీస్ స్టేషన్ లో ర‌చ్చ ర‌చ్చే !

by velandi.Saikiran |

ఓజీ సినిమాకు పోలీస్ స్టేష‌న్ సీన్ గుండెకాయ లాంటిద‌ని సోష‌ల్ మీడియాలో మూవీ చూసిన వాళ్లు చెబుతున్నారు. ఓజీ సినిమా ఒకెత్తు

OG సినిమాకు గుండెకాయ లాంటి సీన్..పోలీస్ స్టేషన్ లో ర‌చ్చ ర‌చ్చే !
X

దిశ‌, వెబ్ డెస్క్: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా చేసిన తాజాగా సినిమా ఓజీ. సుజీత్ (Sujeeth) ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా నిన్న అర్ధ‌రాత్రే... ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా చేయ‌గా... ప్రియాంకా అరుల్ మోహ‌న్ హీరోయిన్ గా చేశారు. అయితే నిన్న రాత్రి రిలీజ్ అయిన...ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. దీంతో జ‌నాలు ఎగ‌బ‌డి చూస్తున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో...ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైర‌ల్ గా మారింది.

ఓజీ సినిమాకు పోలీస్ స్టేష‌న్ సీన్ గుండెకాయ లాంటిద‌ని సోష‌ల్ మీడియాలో మూవీ చూసిన వాళ్లు చెబుతున్నారు. ఓజీ సినిమా ఒకెత్తు అయితే.... ఆ పోలీస్ స్టేష‌న్ సీన్ ఓ రేంజ్ లో ఉంద‌ని పోస్టులు పెడుతున్నారు. ఆ స‌మ‌యంలో... ప్ర‌తి ప్రేక్ష‌కుడి గుండె వేగాన్ని అమాంతం పెంచేస్తుంద‌ని అంటున్నారు. ఆ సీన్ ఉన్నంత సేపు క‌ళ్లు తెరుచుకుని... కూర్చీలోనే అతుక్కుపోవాల్సిందేన‌ట‌. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లోనే ఇలాంటి సీన్ మొద‌టిది అంటున్నారు.

Next Story