కల్పిక పబ్ గొడవ.. తప్పు ఎవరిదో తేల్చేసిన పోలీసులు

by Ajay Maddhiboyina |

ప్రిజ‌మ్ పబ్‌లో టాలీవుడ్ న‌టి క‌ల్పిక‌పై దాడి ఘటనలో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. తప్పు కల్పికదే అని స్పష్టం చేశారు. సబ్‌స్క్రైబర్‌ల కోసమే కల్పిక పబ్‌లో హల్చల్ చేసిందని పోలీసులు వెల్లడించారు.

కల్పిక పబ్ గొడవ.. తప్పు ఎవరిదో తేల్చేసిన పోలీసులు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రిజ‌మ్ పబ్‌లో టాలీవుడ్ న‌టి క‌ల్పిక‌పై దాడి ఘటనలో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. తప్పు కల్పికదే అని స్పష్టం చేశారు. సబ్‌స్క్రైబర్‌ల కోసమే కల్పిక పబ్‌లో హల్చల్ చేసిందని పోలీసులు వెల్లడించారు. బర్త్ డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో కల్పిక గొడవకు దిగినట్టు నిర్దారించారు. మరోవైపు కల్పిక తన సోషల్ మీడియాలో లైవ్ పెట్టి పబ్ నిర్వాహకులు తనతో దురుసుగా ప్రవర్తించారని వాపోయింది. అయితే వీడియోలోనూ కల్పిక పబ్ నిర్వాహకులతో రెచ్చగొట్టేలా మాట్లాడినట్టు కనిపించింది. తన పుట్టినరోజు అని కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వాలని కల్పిక నిర్వాహకులతో గొడవకు దిగినట్టు కనిపించింది. వీడియో చివరలో కూడా వీడియోను తాను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తున్నానని, తనకు ఫాలోవర్లు కావాలని వాళ్ల కోసమే పోస్ట్ చేస్తున్నానని చెప్పింది. దీంతో పోలీసుల సమయాన్ని వృధా చేసిన న‌టిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. పాపులారిటీ కావాలంటే సినిమాల ద్వారా సంపాదించుకోవాలి కానీ ఇలాంటి ప‌నులు చేయ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు.

Next Story