45 రోజుల్లో షూటింగ్ కంప్లీట్.. సస్పెన్స్ థ్రిల్లర్‌పై డైరెక్టర్ కామెంట్స్

by Chukka Sudharani |

‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ వెర్షన్ టీజర్ రిలీజ్

45 రోజుల్లో షూటింగ్ కంప్లీట్.. సస్పెన్స్ థ్రిల్లర్‌పై డైరెక్టర్ కామెంట్స్
X

దిశ, సినిమా: యాక్షన్, కామెడీ, హారర్ థ్రిల్లర్ క‌ల‌గ‌లిపిన ‘పోలీస్ కంప్లైంట్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం కన్నడ వెర్షన్ టీజర్‌ను బెంగళూరులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం చిత్రబృందం, అతిథుల సందడితో హర్షాతిరేకంగా జరిగింది. ఈ వేడుకకు ‘దేవి’ ఫేమ్ నటి ప్రేమ, ‘దండుపాళ్యం’ ఫేమ్ పూజా గాంధీ, కన్నడ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.ఆర్.కె. విశ్వనాధ్ ముఖ్య అతిథులుగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించారు.

కార్యక్రమంలో మాట్లాడిన ఎన్.ఆర్.కె. విశ్వనాధ్, దర్శకుడు సంజీవ్ మేగోటి పదేళ్ల తర్వాత మళ్లీ ఒక మంచి కథతో క‌న్నడ‌ ఇండస్ట్రీలోకి రావడం ఆనందంగా ఉందని అభినందించారు. ఈ సినిమా ఘ‌న‌ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. నటి ప్రేమ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా బ్లాక్ బ‌స్టర్ సాధిస్తుంద‌ని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ‘కేవలం 45 రోజుల్లో 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో ఈ సినిమాను తెరకెక్కించడం ఒక ప్రత్యేక అనుభవం. ‘పోలీస్ కంప్లైంట్’ పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. త్వర‌లోనే ఈ సినిమాను విడుద‌ల చేస్తాము’ అని తెలిపారు.


Next Story