- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేసవిలో రీ రిలీజ్‍కు సిద్ధమైన పోకిరి.. ఆ రికార్డు కొట్టగలదా?
మహేష్ నటించిన 'పోకిరి'ని ఇదివరకే రీ రిలీజ్ చేశారు. అప్పుడు ఆ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ వేసవిలో ఈ సినిమాను మరోసారి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు 2006లో పోకిరి అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోవా బ్యూటీ ఇలియానా ఇందులో 'మహేష్'కు జోడిగా నటించగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్, నాజర్, అజయ్, ఆలీ, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించాడు.
ఈ సినిమా ఆ సమయంలో అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూవీతో మహేష్, ఇలియానా, పూరి జగన్నాథ్ ముగ్గురికీ కూడా మంచి గుర్తింపు లభించింది. 2006లో విడుదల అయ్యి టాలీవుడ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ చిత్రాన్ని కొంత కాలం క్రితం పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. అందులో భాగంగా 'పోకిరి'కి సూపర్ కలెక్షన్లు వచ్చాయి. రీ రిలీజ్లో భారీ కలెక్షన్లను వసూలు చేసిన చిత్రాలలో ఇది మంచి స్థానంలో నిలిచింది.
ఈ మధ్యకాలంలో మహేష్ నటించిన సినిమాలను పెద్ద ఎత్తున రీ రీ రిలీజ్ కూడా చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా కొన్ని ఇప్పటికే విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇక పోకిరి సినిమాని కూడా మరోసారి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వేసవిలో ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి ఇంపాక్ట్ చూపిస్తుందో లేదో చూడాలి.






