- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పాయిజన్ బేబీ’కి మిలియన్ వ్యూస్.. నెట్టింట దుమ్మురేపుతోన్న మలైకా, రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న మూవీ ‘థామా’.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న మూవీ ‘థామా’. మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో నాల్గవ భాగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నాడు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన స్పెషల్ సాంగ్‌కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. ‘పాయిజన్ బేబీ’ అంటూ సాగే ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతూ విడుదలైన 24 గంటల్లోనే 19 మిలియన్ పైగా వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. అంతే కాకుండా.. ఇందులో బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ మలైకా అరోరా తన ఎనర్జిటిక్ స్టెప్పులతో అందరికి ఆకట్టుకుంటుంది. అలాగే రష్మిక కూడా ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో రష్మిక, మలైకా కాంబో అదిరిపోయిందంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.






