ప్రధాని మోదీ బయోపిక్ షూటింగ్ ప్రారంభం

by Naga Rani Yarlagadda |

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కబోతోంది.

ప్రధాని మోదీ బయోపిక్ షూటింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కబోతోంది. మా వందే అనే టైటిల్ తో ఈ సినిమాను తీయనున్నారు. శనివారం సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాని మోదీ పాత్ర పోషిస్తున్నారు. సినిమ ముహూర్తానికి సంబంధించిన వీడియోను నటుడు ఉన్ని ముకుందన్ పంచుకున్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన వ్యక్తి కథను చెప్పేందుకు కొత్త అధ్యాయం మొదలైందని పేర్కొన్నారు.

ఈ ఏడాది సెప్టెంబరులోనే ప్రధాని మోదీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించగా.. 3 నెలల తర్వాత షూటింగ్ ప్రారంభమయింది. బాహుబలికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కేకే సెంథిల్ కుమార్, కేజీఎఫ్, సలార్ సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన రవి బస్రూర్, నేషనల్ అవార్డు గ్రహీత, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, స్టంట్ డైరెక్టర్ కింగ్ సోలమన్ వంటి దిగ్గజాలు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ పతాకంపై వీర్ రెడ్డి ఎం. ఈ సినిమాను నిర్మిస్తుండగా.. క్రాంతి కుమార్ సిహెచ్ రచన దర్శకత్వం వహిస్తున్నారు.

Next Story