దయచేసి సినిమా చూసి రియాక్ట్ అవ్వండి.. తొందరపడి విమర్శలు చేయొద్దు: చుంకీ పాండే

by Mallepaka Hamsa |

అది కేవలం ఒక ఫ్యూజన్ పర్ఫార్మెన్స్ మాత్రమే. కాలేజీ స్టూడెంట్స్ తమ కల్చరల్ ఫెస్టివల్స్ లేదా కాలేజీ ఈవెంట్స్‌లో కొత్తగా ట్రై చేసే ఒక రకమైన ఎక్స్‌పెరిమెంటల్ డాన్స్ అది.

దయచేసి సినిమా చూసి రియాక్ట్ అవ్వండి.. తొందరపడి విమర్శలు చేయొద్దు: చుంకీ పాండే
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే నటించిన ‘చాంద్ మేరా దిల్’ సినిమాలోని ఒక చిన్న డాన్స్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ఆ సీన్‌లో ఆమె చేసిన ఫ్యూజన్ భరతనాట్యం డ్యాన్స్ పై నెటిజన్లు, క్లాసికల్ డాన్సర్లు, కొందరు రాజకీయ నాయకులు కూడా తీవ్రంగా మండిపడ్డారు. అనన్యా పాండే సాంప్రదాయ భరతనాట్య కళను అవమానించిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. తాజాగా, ఈ వివాదంపై అనన్య తండ్రి, సీనియర్ నటుడు చుంకీ పాండే స్పందిస్తూ.. ‘‘జనాలు ఆ డ్యాన్స్ వీడియోను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఆ సీన్‌లో చేసింది అసలు ప్యూర్ భరతనాట్యం కాదు, అలా చేయాలని కూడా మేకర్స్ అనుకోలేదు.

అది కేవలం ఒక ఫ్యూజన్ పర్ఫార్మెన్స్ మాత్రమే. కాలేజీ స్టూడెంట్స్ తమ కల్చరల్ ఫెస్టివల్స్ లేదా కాలేజీ ఈవెంట్స్‌లో కొత్తగా ట్రై చేసే ఒక రకమైన ఎక్స్‌పెరిమెంటల్ డ్యాన్స్ అది. కానీ జనాలు అది సాంప్రదాయ భరతనాట్యం అనుకుని, ఆ కోణంలోనే తప్పులు వెతకడం మొదలుపెట్టారు. నిజానికి ప్యూర్ భరతనాట్యం చేయాలంటే ఎన్నో సంవత్సరాల కఠినమైన శిక్షణ పట్టుదల అవసరం. కానీ సినిమాలో చూపించింది భవిష్యత్తు కాలపు అడ్వాన్స్డ్ డ్యాన్స్ ఫామ్స్ తో పాటు సాంప్రదాయ నృత్య అంశాలను కలిపి చేసిన ఒక క్రియేటివ్ ఫ్యూజన్ డ్యాన్స్. కాబట్టి దయచేసి జనాలు ముందు సినిమా చూసి, ఆ సీన్ ఏ సందర్భంలో వస్తుందో తెలుసుకుని ఆ తర్వాత రియాక్ట్ అవ్వండి. తొందరపడి విమర్శలు చేయొద్దని" చుంకీ పాండే స్పష్టం చేశారు.

Next Story