- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్థం చేసుకోండి మీ అంచనాలను అందుకునేందుకు కష్టపడుతున్నాం.. ‘రాజాసాబ్’ చిత్రంపై మారుతి ట్వీట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేతిలో దాదాపు 10 సినిమాల వరకు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. పలు హిట్ చిత్రాల సీక్వెల్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేతిలో దాదాపు 10 సినిమాల వరకు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. పలు హిట్ చిత్రాల సీక్వెల్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’(The Rajasaab) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. యోగిబాబు, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది.
అయితే గత కొద్ది రోజుల నుంచి మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ విడుదల చేయడం లేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిత్యం ‘ది రాజాసాబ్’ అప్డేట్స్ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు పోస్టులు పెడుతున్నారు. తాజాగా, ఓ నెటిజన్ మారుతిని ట్యాగ్ చేసి పలు మెసేజ్‌లు పెట్టడంతో అవి చూసిన ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘ది రాజాసాబ్’ సినిమాకు సంబంధించిన కొంచెం టాకీ పార్ట్, కొన్ని పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. మన సినిమా కోసం పలు సీజీఐ స్టూడియోలు పని చేస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన కొన్ని స్టూడియో అవుట్‌పుట్స్ బాగున్నాయి.
ఇక ఇతర స్టూడియోల వర్క్ కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. సాంగ్స్ షూటింగ్స్ పూర్తి అయ్యాక లిరికల్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. మా హార్డ్‌వర్క్‌ను చూపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీకు త్వరలో సమాచారం ఇస్తుంది. ఈ ప్రాసెస్‌లో పలు అంశాలు ఇన్వాల్వ్ అయి ఉంటా. కాబట్టి ఇది ఒక్కరు చేసే పని కాదు. అందుకే కాస్త సమయం తీసుకుంటున్నాము. కాస్త ఓపిక పట్టండి. మీ అంచనాలను అందుకునేందుకే ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. దయచేసి కొంతకాలం వెయిట్ చేయండి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం మారుతి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
We are left with a little talkie part and songs , Many CGI studios are involved in our film , so far the output received from a few studios is exciting, expecting the same from other studios, if songs shoot will complete singles also will entertain you , I am also waiting to show…
— Director Maruthi (@DirectorMaruthi) April 8, 2025
We are left with a little talkie part and songs , Many CGI studios are involved in our film , so far the output received from a few studios is exciting, expecting the same from other studios, if songs shoot will complete singles also will entertain you , I am also waiting to show…
— Director Maruthi (@DirectorMaruthi) April 8, 2025






