- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shah Rukh Khan: దయచేసి వారికి సపోర్ట్ చేయండి.. అభిమానులకు షారుఖ్ ఖాన్ రిక్వెస్ట్ (వీడియో)
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) 2023లో పఠాన్, జవాన్ వంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) 2023లో పఠాన్, జవాన్ వంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నిత్యం పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, షారుఖ్ ఖాన్ తనయుడు ఇండస్ట్రీకి వస్తున్నాడని తనకు సపోర్ట్ చేయాలని అభిమానులకు రిక్వె్స్ట్ చేశారు. అయితే ఆయన కొడుకు ఆర్యన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’(Bads of Bollywood) పేరుతో ఓ వెబ్ సిరీస్ రాబోతుంది.
ఇందులో షారుఖ్ కుమార్తె సుహానా(Suhana Khan) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఈ సిరీస్ ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి చేశారు. ‘‘నేను నా అభిమానులను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నా కుమారుడు ఆర్యన్(Aryan Khan) దర్శకత్వంలో తొలి అడుగు వేస్తున్నాడు. నటిగా నా కుమార్తె కూడా మీ ముందుకురాబోతుంది. నాకు మీరిచ్చిన అభిమానంలో 50 శాతం అయినా వారికి అందించండి.
దయచేసి వారిని సపోర్ట్ చేయండి. ఈ సిరీస్‌లో అందరూ అద్భుతంగా నటించారు. కొన్ని ఎపిసోడ్స్ చూశాను. చాలా ఫన్నీగా అనిపించాను. నాకు అలాంటి హాస్యభరిత సన్నివేశాలంటే ఇష్టం. నేను జోక్స్ వేస్తే ప్రేక్షకులు కొందరు నేను కోపంగా మాట్లాడానిని అనుకుంటున్నారు. అందుకే జోక్స్ వేయడం మానేశాను. నా వారసత్వాన్ని ఆర్యన్‌కు అందించి నన్ను గర్వపడేలా చేయమని చెప్పాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






