Manchu Lakshmi: దయచేసి ఎవరైనా సాయం చేయండి.. వాళ్లు దురుసుగా ప్రవర్తించారంటూ మంచు లక్ష్మి ట్వీట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు(Mohan Babu) కూతురు మంచు లక్ష్మి(Manchu Lakshmi Prasanna) తెలుగు, హాలీవుడ్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది.

Manchu Lakshmi: దయచేసి ఎవరైనా సాయం చేయండి.. వాళ్లు దురుసుగా ప్రవర్తించారంటూ మంచు లక్ష్మి ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు(Mohan Babu) కూతురు మంచు లక్ష్మి(Manchu Lakshmi Prasanna) తెలుగు, హాలీవుడ్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది. కానీ గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరం అయిన ఆమె పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. గత ఏడాది మంచు లక్ష్మి మళ్లీ ‘ఆదిపర్వం’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, మంచు లక్ష్మి x ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines) తనతో దురుసుగా ప్రవర్తించారని తెలుపుతూ సాయం కోరింది. ‘‘నా లగేజ్ బ్యాగ్‌ను పక్కకు తోసేసి ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పిన విధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు.

సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. ఇదొక రకమైన వేధింపు. నా కళ్లెదుట సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈ విధంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు. దయచేసి ఎవరైనా సహాయం చేయండి!!! వారు స్లీప్ అప్నియా యంత్రం కోసం ప్రజలను పక్కకు లాగారు! ఒక అమ్మాయి తన లగేజీని వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే.. వారు సమయానికి ఆమె బ్యాగ్‌ను ఇవ్వలేరు’ అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమెకు అండగా నిలుస్తున్నారు.

Next Story