- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి మమ్మల్ని క్షమించండి.. పెళ్లి తర్వాత పుష్ప నటుడు ఎమోషనల్ పోస్ట్.. అసలేం జరిగిందంటే?
కోలీవుడ్ నటుడు డాలి ధనుంజయ్(Dolly Dhanunjay) అందరికీ సుపరిచితమే. తమిళంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు డాలి ధనుంజయ్(Dolly Dhanunjay) అందరికీ సుపరిచితమే. తమిళంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక 2021లో వచ్చిన ‘పుష్ప’(Pushpa) సినిమాతో అతను ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. ఇక ‘పుష్ప’ ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మూవీలో ధనుంజయ్, జాలి రెడ్డి పాత్రలో నటించి తన విలనిజంతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. గత ఏడాది ‘జిగ్రా’తో ప్రేక్షకులను అలరించాడు. ఇక ధనుంజయ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన ధన్యత అనే డాక్టర్‌ను ప్రేమించాడు. ఇటీవల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
ఈ క్రమంలో.. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘అందరికీ నమస్కారం. పెళ్లికి వచ్చిన వారందరికీ, రాలేకపోయిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు ఘనంగా జరగడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు, మీడియా, పోలీసు శాఖ, కార్యకర్తలు, అభిమానులు ఇలా ఎంతో మంది కృషి చేసిన అందరికీ చాలా ధన్యవాదాలు. కొంతమంది వ్యక్తులు మమ్మల్ని చేరుకోవడంలో ఇబ్బంది కలిగినా లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్న వ్యక్తుల కారణంగా మమ్మల్ని చేరుకోలేకపోయినా దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము తప్పకుండా మరిన్ని మంచి విషయాలతో తిరిగి వస్తాము. నా సినీ పరిశ్రమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి మా కోసం పనిచేసిన నా సినీ పరిశ్రమ మిత్రులకు, తారలకు, కార్మికులకు, ప్రొడక్షన్ మేనేజర్‌ల బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. పెళ్లి ఆనందాన్ని మరింత పెంచిన అభిమానులకు స్పెషల్ థాంక్స్’’ అని రాసుకొచ్చాడు. అలాగే భార్యతో అభిమానులతో ముచ్చటించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేశాడు.






