Akshay Kumar: ఆ సమస్యతో బాధపడుతున్నారా.. దయచేసి ఇలా చేయండంటూ స్టార్ హీరో కీలక విజ్ఞప్తి (ట్వీట్)

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) వరుస సినిమాలు చేస్తూనే ఓ వైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

Akshay Kumar: ఆ సమస్యతో బాధపడుతున్నారా.. దయచేసి  ఇలా చేయండంటూ స్టార్ హీరో కీలక విజ్ఞప్తి (ట్వీట్)
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) వరుస సినిమాలు చేస్తూనే ఓ వైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఖేల్ఖేల్ మే, సింగం అగైన్ (Singham Again)చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. బాక్సాఫీసు వద్ద నిరాశనే ఎదుర్కొన్నారు. ఎలాగైన విజయం సాధించాలని వెంటనే ‘స్కై ఫోర్స్’(Sky Force)తో వచ్చారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా విజయం సాధించలేకపోయింది. మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ట్రోల్స్‌ను ఎదుర్కొంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్, మంచు విష్ణు (Manchu Vishnu)డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’(Kannappa)లో శివుడి పాత్రలో నటిస్తున్నారు.

మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు(Mohan Babu), శరత్ కుమార్, కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), వంటి స్టార్స్ నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే.. అక్షయ్ కుమార్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా, ఆయన ఊబకాయంతో బాధపడుతున్న వారికి కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు xలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఊబకాయం గురించి ప్రధాని మోదీ చెప్పింది నిజం. కొన్నేళ్లుగా నేను కూడా ఇదే చెబుతున్నాను.

ఇప్పుడు ప్రధాని ఈ అంశాన్ని స్వయంగా లేవనెత్తారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే అంతా బాగుంటుంది. సరిపడ నిద్ర, స్వచ్ఛమైన గాలి, సుర్యరశ్మి, మన వంటకాల్లో తక్కువ నూనె వాడకం దేశీ నెయ్యి ఉపయోగించాలి. ఊబకాయంతో పోరాడేందుకు ఇవే పెద్ద అయుధాలుగా పనిచేస్తాయి. అంతేకాకుండా వ్యాయామాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. ఎలాంటి వ్యాయామమైనా కచ్చితంగా ప్రతి రోజూ చేసేందుకు ప్రయత్నించండి. నేను చెప్పింది నమ్మండి, స్థూలకాయాన్ని పాలదోలడంలో ఇది ఉపయోగపడుతుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే మోదీ మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story