- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దు.. ఆ వీడియోలు తొలగించాలంటూ స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన వరుస ప్రాజక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘కూలీ’ (Coolie)సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. ఓ హీరో గురించి వస్తున్న తప్పుడు వార్తల గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. హీరో శ్రీరామ్ నటరాజన్(Sriram Natarajan) గురించి వచ్చే వార్తను నమ్మకండి అంటూ ఓ నోట్ పెట్టారు. ‘‘శ్రీరామ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న శ్రేయోభిలాషులు, స్నేహితులకు మా విన్నపం.
ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు కొన్నిరోజుల పాటు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటాడు. దయచేసి అతని వ్యక్తగత గోప్పతకు భంగం కలిగించవద్దు. అదేవిధంగా తప్పుడు కథనాలు చూసి మా కుటుంబం ఎంతో బాధపడుతుంది. అదే విధంగాఅతడి ప్రస్తుతం పరిస్థితి గురించి అభ్యంతరకరంగా ఏమైనా వీడియోలు, ఇంటర్వ్యూలు షేర్ చేసి ఉంటే దయచేసి అలాంటివి తొలగించండి’’ అని రాసుకొచ్చారు. అయితే శ్రీరామ్ నటరాజన్ లోకేష్ తెరకెక్కించిన ‘మా నగరం’ సినిమాలో హీరోగా నటించడంతో ఆయన గురించి వచ్చే వార్తల గురించి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) April 18, 2025






