- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి వాటిని నమ్మి మోసపోవద్దు.. కీలక ప్రకటనతో అభిమానులను హెచ్చరించిన శ్రీదేవి
ఒక ముఖ్యమైన ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చారు. తన పేరు మీద జరుగుతున్న కొన్ని తప్పుడు ప్రచారాలు, డిజిటల్ మోసాలపై శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

దిశ, సినిమా: ‘కోర్ట్’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయిన శ్రీదేవి మొదటి ప్రాజెక్ట్‌తోనే ఫుల్ ఫేమ్ రాబట్టుకున్నారు. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే ఆమె ఊహించని క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆమె నటించిన ‘బ్యాండ్ మేళం’ సినిమా ఆశించినంతగా ఆడకపోయినా, ఆమెకు తెలుగుతో పాటు తమిళంలోనూ వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తమిళంలో కేజేఆర్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ‘హైకూ’ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏగన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని యువరాజ్ చిన్నసామి తెరకెక్కిస్తున్నారు. వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న శ్రీదేవి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చారు. తన పేరు మీద జరుగుతున్న కొన్ని తప్పుడు ప్రచారాలు, డిజిటల్ మోసాలపై శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
కొంతమంది మోసగాళ్లు తన పర్మిషన్ లేకుండా, తన పేరును, ఫొటోలను, ఐడెంటిటీని వాడుకుంటూ కొన్ని నకిలీ యూట్యూబ్ ఛానెళ్లను నడిపిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆమె వెల్లడించారు. ఆ ఫేక్ అకౌంట్ల ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ, జనాలను మోసగించే ప్రమాదం ఉందని, అందుకే అభిమానులంతా అలర్ట్‌గా ఉండాలని ఆమె కోరారు. ఆ నకిలీ యూట్యూబ్ ఛానెళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీదేవి స్పష్టం చేశారు. ఎవరైనా సరే యూట్యూబ్‌లో తన పేరుతో ఉన్న ఛానెళ్లను చూసి.. అవి తన అఫీషియల్ ఛానెల్స్ అనుకుని దయచేసి మోసపోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. అవన్నీ వంద శాతం ఫేక్ ఛానెల్స్ అని, సినిమా విషయాలైనా లేదా తన పర్సనల్ లైఫ్ అప్‌డేట్స్ అయినా సరే కేవలం తన ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ పేజీ ద్వారా మాత్రమే ప్రకటిస్తానని ఆమె తేల్చి చెప్పారు. సైబర్ మోసాలపై వెంటనే అలర్ట్ అయ్యి ఫ్యాన్స్‌ను హెచ్చరించడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.






