Actor Atul Kulakarni : ప్లీజ్.. పహల్గాంకు రండి : ప్రముఖ నటుడి రిక్వెస్ట్

by Muthe.Rajitha |

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ మేడోస్‌లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Actor Atul Kulakarni : ప్లీజ్.. పహల్గాంకు రండి : ప్రముఖ నటుడి రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ మేడోస్‌లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఉగ్రదాడి అనంతరం వేలాది పర్యాటకులు కశ్మీర్ ను వీడారు. ప్రస్తుతం పహల్గాం పేరు ఎత్తితేనే వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కశ్మీరీల బాధ మరోలా ఉంది. పర్యాటకులు రాకపోతే తాము ఆకలితో అలమటించాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రధాన ఆదాయం టూరిజం(Jammu Kashmir Tourism) నుంచే వస్తుందని.. దాడి తర్వాత పర్యాటకులు ఇక్కడికి రావడానికే భయపడుతున్నారని, కాని మాలాంటి సామన్యులు ఈ కఠిన పరిస్థితుల్లోనే బతుకుతున్నామని చెబుతున్నారు. కశ్మీరీల బాధను అర్థం చేసుకున్న ప్రముఖ నటుడు మాత్రం దయచేసి కశ్మీరును సందర్శించండి, అక్కడి వారిని ఆదుకోండి అంటున్నాడు.

విలక్షణ నటుడు అతుల్ కులకర్ణి(Actor Atul Kulakarni) చేసిన ఈ రిక్వెస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉగ్రదాడి అనంతరం స్వయంగా పహల్గాంను సందర్శించిన ఆయన.. కశ్మీర్ సురక్షితం అని, ప్రేక్షకులు ఇక్కడికి రావాలని, పర్యాటకుల బాధ్యతను తాము తీసుకుంటామని కశ్మీరీలు హామీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఎంత అద్భుతంగా ఉందో.. ఇక్కడి మనుషులు కూడా అంతే అద్భుతమైన వారు అని వ్యాఖ్యానించారు. దయచేసి పహల్గాంను తప్పక సదర్శించండి అని అతుల్ కులకర్ణి ప్రజలను కోరారు.

Next Story