ఆ పాత్రలు చేయడం బిగ్గెస్ట్ చాలెంజ్.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల-2’. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. సంపత్ నంది కథా రచయితగా వ్యవహిరిస్తున్నారు.

ఆ పాత్రలు చేయడం బిగ్గెస్ట్ చాలెంజ్.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల-2’(Odela-2). అశోక్ తేజ (Ashok Teja)దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. సంపత్ నంది కథ అదించడంతో పాటు రచయితగా వ్యవహిరిస్తున్నారు. అయితే ఇందులో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ‘ఓదెల రైల్యే స్టేషన్’కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీలో తమన్నా నాగసాధువుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘ఓదెల-2’చిత్రం ఏప్రిల్ 17న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘బాహుబలి, హ్యాపీడేస్ చిత్రాలకు అంతపెద్ద సక్సెస్ వస్తుందని అప్పట్లో నేను అస్సలు ఊహించలేదు.

అయితే నేను ఎలాంటి నిర్ణయాలు అయినా సరే మనసు నుంచి తీసుకుంటాను. ఓదెల-2 విషయానికొస్తే.. ఈ క్యారెక్టర్‌కు రెఫరెన్స్ లేదు. మేము ఎక్కువగా సొంతంగానే ట్రై చేశాం. చాలా వేరియేషన్స్‌తో మహిళలు స్ట్రాంగ్ అని ఇందులో చూపించాము. నేను ఈ సినిమా అయిపోయే వరకు ఎవరినీ గమనించలేదు అన్నింటికీ దూరంగా ఉన్నాను. ఒక నాగసాధువు, శివశక్తి వంటి క్యారెక్టర్స్ చేయడం బిగ్గెస్ట్ చాలెంజ్‌. అసలు అటెంప్ట్ చేస్తేనే ఒక గెటప్ అనేది వచ్చేస్తుంది. కానీ అవన్నీ చేయకుండా.. రియల్‌గా కనిపించాలని అనుకున్నాము. ప్రేక్షకులు రియల్ అని నమ్మడానికి సహజంగా వచ్చేలా ప్రయత్నించాం. కాస్టూమ్‌లా కనిపంచకుండా నాచురల్‌గా ఉండేందుకు చాలా చేశాం. ఫేక్ అనిపించకూడదని ఫీల్ అయ్యాం. చాలా ఫెంటాస్టికల్ థింగ్స్ ఉన్నప్పటికీ నా క్యారెక్టర్‌ను నమ్మకపోతే దానికి అర్థం ఉండదు’’ అని చెప్పుకొచ్చింది.

Next Story