- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రకుల్ ప్రీత్ సింగ్‌కు ఫోన్ ట్యాపింగ్‌కు లింక్.. సోషల్ మీడియాలో వైరల్?
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh)ను కొత్త పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh)ను కొత్త పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్, ప్రభాస్ మినహా అందరు స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. మహేశ్ బాబు - ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్, రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ధృవ, ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సరైనోడు వంటి సినిమాల్లో రకుల్ హీరోయిన్‌గా నటించింది. ఈ నాలుగు సినిమాల్లో ఆమె పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా తనకంటూ తెలుగులో అభిమానులను సంపాదించుకున్నది. ప్రస్తుతం టాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చింది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
అయితే.. ప్రస్తుతం రకుల్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె సినిమాల్లో ఫోన్ ట్యాపింగ్ సీన్లు ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల్లో ఫోన్ ట్యాపింగ్ సన్నివేశాలే(Phone Tapping Scenes) ఎక్కువ ఉండటంతో చర్చనీయాంశంగా మారింది.
నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ రకుల్ ప్రీత్ సింగ్‌ను ట్రాప్ చేస్తాడు. జగపతిబాబు కోసం అందులో భాగంగా ఆమెకు సంబంధించిన ఫోన్ డిటేల్స్ అన్ని తీసుకుంటాడు దగ్గర అవుతాడు.
రామ్ చరణ్ హీరోగా నటించిన ధృవ సినిమాలోనూ ఇదే తరహా సీన్ ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ ట్యాప్ చేయడు కానీ.. రకుల్ ప్రీత్ ప్రతీ కదలిక హీరోకు శరీరంలో అమర్చిన GPS ట్రాకింగ్ ద్వారా వల్ల మాటలు వింటాడు.
ఇక మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమాలో ఏకంగా మహేష్ బాబు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ ట్యాప్ చేసి అన్నీ వింటాడు. ఆమె ప్రతి కదలిక గురించి తెలుసుకుంటూ.. తదుపరి స్టెప్ వేస్తాడు. ఈ సినిమాల్లోని సీన్లు అన్నీ గమనించిన నెటిజన్లు రియల్ లైఫ్‌లో అయినా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసు కూడా ఓ కారణమని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ కేసులో రాజకీయ ప్రముఖులే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. పోలీసుల విచారణ ఒక్కో అంశం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ.. ఈ వార్తలను ఆ ఇద్దరు హీరోయిన్లలో ఎవరూ ఖండించలేదు. అభిమానులు మాత్రం ఈ వార్తల వల్ల హీరోయిన్ల ప్రతిష్టకు, ఇమేజ్‌కు భంగం వాటిల్లే అవకాశాలున్నాయని ఫ్యాన్స్ మండిపడ్డారు.
సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ రకుల్ ఫోన్ ట్యాపింగ్‌ను ఎదుర్కొన్నట్టేనని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రకుల్ వివాదాల్లో చిక్కి తెలుగు తెరకు దూరం కావడం పట్ల ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.






