- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘పెరుసు’ మూవీ.. ఏ సర్టిఫికెట్ వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! (ట్వీట్)
యంగ్ హీరో వైభవ్ రెడ్డి(Vaibhav Reddy), సునీల్, కరుణాకరన్(Karunakaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెరుసు’.

దిశ, సినిమా: యంగ్ హీరో వైభవ్ రెడ్డి(Vaibhav Reddy), సునీల్, కరుణాకరన్(Karunakaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెరుసు’. ఇళంగో రామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను తెలుగులో ‘పెద్ద’ పేరుతో తీసుకురాబోతున్నారు. అయితే ఇందులో నిహారిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజ్ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, హర్మాన్ బవేజా బవేజా స్టూడియోస్, ఎంబర్‌లైట్ స్టూడియోస్, శశి నాగ సహకారంతో నిర్మించింది. దీనికి అర్జున్ రాజ్ సంగీతం అందిస్తుండగా.. సత్యతిలకం సినిమాట్రోగ్రాఫర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, టీజర్ విడుదలవగా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయంగ్ హీరో వైభవ్ రెడ్డి(Vaibhav Reddy), సునీల్, కరుణాకరన్(Karunakaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెరుసు’.. అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 14న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తి అయినట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘పెరుసు’ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుపుతూ.. వైభవ్, నిహారిక జూమ్ కాల్‌లో మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.
So #Perusu gets an 'A' Certificate....
— karthik subbaraj (@karthiksubbaraj) March 5, 2025
And I got on a Zoom Call ...🙂#PerusufromMarch14 pic.twitter.com/mB3vgy1a8d






