- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్‌లో ‘పర్సెంటేజీ’ సెగ : థియేటర్ల బంద్ వైపు ఎగ్జిబిటర్లు?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్లి పర్సెంటేజీ వివాదం రాజుకుంది. మల్టీప్లెక్స్ తరహా మూవీ వసూళ్లలో వాటా కావాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో అద్దె (Rental) వర్సెస్ పర్సెంటేజీ (Percentage) వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై నిర్మాతల మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో టాలీవుడ్‌లో కొత్త సంక్షోభం నెలకొంది. అయితే, హైదరాబాద్ (Hyderabad)లోని 23 థియేటర్లలో ప్రయోగాత్మకంగా పర్సెంటేజీ విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా ఎగ్జిబిటర్ల సంఘం ప్రకటించింది. వారి ప్రతిపాదన ప్రకారం సినిమా విడుదలైన తొలి వారం వసూళ్లలో 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం థియేటర్లకు వాటా ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న ఫిక్స్‌డ్ అద్దె విధానం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్రంగా నష్టపోతున్నాయని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాలు ఆడినా, ఆడకపోయినా నిర్వహణ ఖర్చులు భారం అవుతున్నాయని, అందుకే మల్టీప్లెక్స్ తరహా షేరింగ్ పద్ధతే కరెక్ట్ అని వారు వాదిస్తున్నారు.
నిర్మాతల గిల్డ్ ససేమిరా.. మే 1 నుంచి థియేటర్లు బంద్?
తెలంగాణ ఫిలిం ఛాంబర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిర్మాతల గిల్డ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. థియేటర్లకు భారీగా పర్సెంటేజీలు ఇవ్వడం కుదరదని, ఇది నిర్మాతలపై అదనపు భారం మోపడమేనని గిల్డ్ స్పష్టం చేసింది. మరోవైపు ఈ వివాదంపై ఏప్రిల్ 30లోపు తుది నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్ డెడ్‌లైన్ విధించింది. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేరకపోతే, మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేసే ఆలోచనలో ఉన్నట్లు ఎగ్జిబిటర్ల సంఘం హెచ్చరించింది.






