- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనాలు చాలా త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేసి విమర్శించేస్తారు.. నెటిజన్ల ట్రోలింగ్‌పై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు
రామ్ చరణ్ సార్ చెప్పినట్లుగా.. ఒక సినిమాను పూర్తి నిజాయితీతో, కఠోర శ్రమతో, మంచి ఉద్దేశంతో రూపొందిస్తే, అది కచ్చితంగా చేరాల్సిన ప్రేక్షకులను చేరుతుందని నేను బలంగా నమ్ముతాను.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా జూన్ 4న థియేటర్స్‌లోకి రాబోతుంది. అప్పుడే ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీమ్ నిత్యం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, జాన్వీ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. "రామ్ చరణ్ సార్ చెప్పినట్లుగా.. ఒక సినిమాను పూర్తి నిజాయితీతో, కఠోర శ్రమతో, మంచి ఉద్దేశంతో రూపొందిస్తే, అది కచ్చితంగా చేరాల్సిన ప్రేక్షకులను చేరుతుందని నేను బలంగా నమ్ముతాను.
ఈ రోజుల్లో జనాలు చాలా త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేసి విమర్శిస్తుంటారని నాకు తెలుసు. కానీ అంతిమంగా చూస్తే సినిమా అనేది ఒక సేవ లాంటిది కదా? ప్రేక్షకులను చేరుకోవడానికి, వారికి థియేటర్లలో మంచి వినోదాన్ని పంచడానికే కదా మనం ఇంత కష్టపడి మూవీస్ తీస్తున్నది. కాబట్టి, ప్రేక్షకులు చిత్రం గురించి ఏమని భావిస్తున్నారు లేదా వారు ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు అనే అంశాలను మనం పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయలేము. నా వ్యక్తిగత ఉద్దేశం ఏమిటంటే.. సినిమా రంగానికి ప్రేక్షకులే దైవంతో సమానం. మనం కేవలం వారి ఇష్టాలను, అవసరాలను గుర్తిస్తూ వారికి మంచి చిత్రాల ద్వారా సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నామని నేను భావిస్తాను" అంటూ చెప్పుకొచ్చింది.






