అభిమానిని పట్టించుకోకపోవడంపై పూజా హెగ్డే రియాక్షన్ ఇదే.. కామెంట్స్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-30 07:25:25  IST  )

సినిమా వాళ్లకు జీవితాన్ని ఇచ్చేది ప్రేక్షకులే. పరిస్థితుల కారణంగా కొన్ని సమయాల్లో హడావిడిగా ఉన్నప్పుడు అభిమానులను గమనించకపోవచ్చు.

అభిమానిని పట్టించుకోకపోవడంపై పూజా హెగ్డే రియాక్షన్ ఇదే.. కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు ఈ మధ్య కాలంలో అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ, ఈ అమ్మడి ఖాతాలో సరైన సక్సెస్ పడక చాలా రోజులైంది. అయినప్పటికీ తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. పూజా హెగ్డే నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన పూజా హీరోయిన్‌గా నటించగా, మరో క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కనిపించనుంది. డేవిడ్ ధావన్ తెరకెక్కించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న ఈ సమయంలో పూజా హెగ్డే చిక్కుల్లో పడింది.

ఇటీవల ఒక ఈవెంట్‌లో ఓ యువకుడు పూజాతో సెల్ఫీ దిగడానికి ఎంతో ఆత్రుతగా ప్రయత్నించాడు. కానీ, పూజా హెగ్డే అతడిని అస్సలు పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అభిమానుల వల్లే మీరు సెలబ్రిటీలు అయ్యారు.. అలాంటిది సెల్ఫీ అడిగితే అంత పొగరా? అందుకే నీకు ఈ మధ్య ఒక్క హిట్ కూడా పడట్లేదు" అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను దారుణంగా తిట్టిపోస్తున్నారు. ఈ వివాదం కాస్త పెద్దదవ్వడంతో తాజాగా పూజా హెగ్డే దీనిపై తనదైన శైలిలో స్పందించి క్లారిటీ ఇచ్చింది. "సినిమా వాళ్లకు జీవితాన్ని ఇచ్చేది ప్రేక్షకులే. పరిస్థితుల కారణంగా కొన్ని సమయాల్లో హడావిడిగా ఉన్నప్పుడు అభిమానులను గమనించకపోవచ్చు. అంతేకానీ, మాకేదో పొగరు ఉందని, అభిమానులను అగౌరవపరుస్తున్నామని అర్థం కాదు. మాకు ఎప్పుడూ అభిమానులే దేవుళ్లు. కాబట్టి దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు" అని పూజా హెగ్డే చెప్పింది.

Next Story