జనాలు రివ్యూలను అస్సలు పట్టించుకోరు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోన వెంకట్

by Pulgam srinivas |

కోన వెంకట్ మాట్లాడుతూ… నెగటివ్ రివ్యూలు సినిమాను ఏమీ చేయలేవని, కంటెంట్ బాగుంటే సినిమాను ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు.

జనాలు రివ్యూలను అస్సలు పట్టించుకోరు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోన వెంకట్
X

దిశ, వెబ్ డెస్క్: నటుడు, సంగీత దర్శకుడు అయిన రఘు కుంచె తాజాగా గేదెల రాజు (కాకినాడ తాలూకా) అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాను ఏప్రిల్ 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ బృందం తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వి.వి. వినాయక్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో భాగంగా కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

తాజాగా కోన వెంకట్ మాట్లాడుతూ... రఘు కుంచె గారు తన కొడుకును ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నారని, అందుకే ముందు తానే హీరోగా మారారని తెలిపారు. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలో స్టార్ హీరో ఉన్నాడా? చిన్న హీరో ఉన్నాడా? అనే విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. కేవలం కథ (కంటెంట్) పైనే ప్రేక్షకులు దృష్టి పెడుతున్నారని చెప్పారు. కథ బాగుంటే చిన్న హీరో నటించిన సినిమాలకు కూడా పెద్ద కలెక్షన్లు వస్తున్నాయని, అదే కథ సరిగ్గా లేకపోతే స్టార్ హీరో నటించిన చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదని అన్నారు. అందుకే సినిమాకు ముఖ్యమైనది స్టార్‌లు కాదు, బడ్జెట్ కాదు, కేవలం కథ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

అలాగే, జనాలు రివ్యూలను కూడా అస్సలు పట్టించుకోరని చెప్పారు. సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాల్లో ఏదో ఒకటి వారికి కనెక్ట్ అయితే థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తారని, సినిమా బాగుంటే నెగటివ్ రివ్యూలు వచ్చినా అవి మూవీపై ఎలాంటి ప్రభావం చూపవని ఆయన తెలిపారు. ఇక తాను తాజాగా నిర్మించిన బ్యాండ్ మేళం సినిమా వల్ల తనకు అనేక అనుభవాలు కలిగాయని, ఆ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ లభించిందని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా కోన వెంకట్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story