"జాన్వీకి కీలకంగా మారిన ‘పెద్ది’.. ఈసారైనా మెప్పిస్తుందా?

by Pulgam srinivas |

‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్ నటనతో మెప్పించకపోతే, తెలుగులో ఆమె కెరీర్‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

జాన్వీకి కీలకంగా మారిన ‘పెద్ది’.. ఈసారైనా మెప్పిస్తుందా?
X

దిశ, వెబ్ డెస్క్: హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత జాన్వీ కపూర్, దేవర : పార్ట్ 1 చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు ఆమె పాత్రపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాల్లో జాన్వీ తన గ్లామర్‌తో ఆకట్టుకోవడంతో, నటన పరంగా కూడా మెప్పిస్తే తెలుగులో ఈ ముద్దుగుమ్మకు తిరుగుండదని అప్పట్లో చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే, ‘దేవర’ చిత్రంలో జాన్వీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఆమె పాత్ర, గ్లామర్‌కు మాత్రమే పరిమితమైందనే విమర్శలు వినిపించాయి.

నటనకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఆమె తన ప్రతిభను పూర్తిగా చూపించలేకపోయిందని కొందరు భావించారు. ప్రస్తుతం జాన్వీ ‘పెద్ది’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో కూడా ఆమె గ్లామర్‌తోనే ఆకట్టుకుంటోంది. దీంతో ఈసారి అయినా నటన పరంగా బలమైన ప్రదర్శన ఇస్తే తెలుగులో వరుస అవకాశాలు దక్కే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే కేవలం గ్లామర్‌కే పరిమితమైతే అవకాశాలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. దాంతో జాన్వీ కపూర్‌కు ‘పెద్ది’ సినిమా కీలకంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story