ఆ సంస్థ చేతికి ‘పెద్ది’ ఉత్తరాంధ్ర హక్కులు.. ఏకంగా అన్ని కోట్ల డీల్

by Pulgam srinivas |

పెద్ది ఉత్తరాంధ్ర హక్కులను పూర్వీ పిక్చర్స్ సంస్థ రూ.19 కోట్ల నాన్-రిటర్నబుల్ అడ్వాన్స్‌తో పాటు రూ.2 కోట్ల రిటర్నబుల్ అడ్వాన్స్ కింద దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఆ సంస్థ చేతికి ‘పెద్ది’ ఉత్తరాంధ్ర హక్కులు.. ఏకంగా అన్ని కోట్ల డీల్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ థియేట్రికల్ హక్కుల వ్యాపారాన్ని వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘పెద్ది’ ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులు కూడా అమ్ముడైనట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఉత్తరాంధ్ర హక్కులను పూర్వీ పిక్చర్స్ సంస్థ రూ.19 కోట్ల నాన్-రిటర్నబుల్ అడ్వాన్స్‌తో పాటు రూ.2 కోట్ల రిటర్నబుల్ అడ్వాన్స్ కింద దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఈ నెల 16 లేదా 17 తేదీల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటే ‘పెద్ది’పై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story