‘పెద్ది’ ట్రైలర్ రిపోర్ట్.. ఇరగదీసిన రామ్ చరణ్

by Pulgam srinivas |

‘పెద్ది’ ట్రైలర్‌లో రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

‘పెద్ది’ ట్రైలర్ రిపోర్ట్.. ఇరగదీసిన రామ్ చరణ్
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్ర ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత నాగవంశీ వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించడంతో ట్రైలర్ పై అంచనాలు మరింత పెరిగాయి. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో పరిశీలిద్దాం.

ట్రైలర్‌లో ఎక్కువ భాగం రామ్ చరణ్ పాత్ర చుట్టూనే సాగింది. ఇందులో చరణ్ పలు విభిన్న లుక్స్‌లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా క్రికెటర్‌గా, కుస్తీ వీరుడిగా ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా రన్నర్ పాత్రలో కూడా చరణ్ కనిపించనున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. ప్రతి సన్నివేశంలోనూ తన నటనతో రామ్ చరణ్ ఆకట్టుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రామ్ చరణ్ తర్వాత జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్, దివ్యేందు, జగపతిబాబు పాత్రలకు కూడా ట్రైలర్‌లో ప్రాధాన్యం ఇచ్చారు.

వీరంతా తమ తమ పాత్రల పరిధిలో బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ ట్రైలర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. మూడు నిమిషాలకు పైగా నిడివితో వచ్చిన ఈ ట్రైలర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Next Story